పద్మశాలీలు
పద్మశాలి / పద్మబ్రాహ్మణ / భార్గవ బ్రాహ్మణ భారతదేశంలో ఒక సామజిక వర్గం మరియు ఒక కులం.సామజిక
పద్మశాలీ చరిత్ర
పద్మశాలీ అను నామము యొక్క అర్థము మరియు వివరణ
పద్మశాలీ (సంస్కృతాంద్ర పదము) : లక్ష్మి పొందుట వలన ప్రకాశించుట ( బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) లింగభేదమున బ్రహ్మ పొందుట వలన ప్రకాశించుట (బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) వెరసి పద్మముద్వారా ప్రకాశించుట లేదా ప్రకాశించువారు (బహువచనమున లేదా వ్యక్తివాచకమున).
పద్మశాలీ అను నామము యొక్క వివరణను అమరకోశం ద్వారా గ్రహిస్తే అది ఈ విధంగా ఉంటుంది.
పద్మశాలీ అనునది రెండు పదముల కలయిక (సంస్లిష్ట వాక్యము) పద్మము మరియు శాలి (లీ) (పద్మ+శాలి (లీ) = పద్మశాలి (లీ) )
వాక్యములకు అమరకోశము వివరణ ఇవ్వలేదు కేవలం పదములకు మాత్రమే వివరణ ఇస్తుంది.
పద్మ (ము) : "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మ:" (అమర కోశము) దీని యందు లక్ష్మి (లక్ష్మి అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. లింగ భేదమున బ్రహ్మ (బ్రహ్మ అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. (లక్ష్మి మరియు బ్రహ్మ ఈ రెండు సమానార్థకములు మరియు ఈ ఇద్దరిని అన్నా చెల్లలుగా పండితులు చెపుతారు. లక్ష్మి బ్రహ్మలు, సరస్వతి శివుడు, పార్వతి విష్ణువులను అన్నా చెల్లలుగా పండితులు వివరిస్తారు. ఇందుకు గల కారణం ఏమనిన ఒకే తత్వమును వీరు కలిగి ఉండుట వలన ఈ విధంగా పండితులు వివరించడం జరిగింది.) తెలుగులో కూడా ఇదే అర్థము వచ్చును.
శాలి : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః (శాలి)" జనుల చేత పొగడబడునది. ( ఈ శాలీ (లి) అను పదము విశేషణ పదము. ఈ పదము పూర్వ పదము యొక్క విశేషణమును వివరించును.) తెలుగులో శాలి (లీ) అనగా ఒప్పారునది లేదా ప్రకాశించునది. అని అర్థము.
పద్మశాలీ (లి) అనాగా వృద్ది పొందుట వలన పొగడ బడినవారు లేదా వృద్ది పొందుట వలన ప్రకాశించిన వారు అని అర్థము. ఇక్కడ వృద్ది అనగా సృష్ఠించుట, పైకి ఎగబ్రాకుట, మార్పుచేయుట, కొత్తదానిని ఆవిష్కరించుట మొ|| లగు నానార్థములు ఉన్నాయి. అన్ని కూడా అత్యుత్తమమైన ప్రతిభ కల్గిన అని మూలార్థము. పద్మశాలి అనునది ఒక బిరుదు. ఇలా బిరుదు పొందిన వారి సమూహమును పద్మశాలీలు అని అంటారు.

0 వ్యాఖ్యలు:
Post a Comment