Filled Under:

రథ సప్తమి విశేషాలు

🌞 *రథ సప్తమి విశేషాలు* 🌞
       
🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏

⭕👉🏻 *రథ సప్తమి :-* 24/1/2018 న
మాఘ మాసము , శుక్ల పక్షము , సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు.రథ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలలో పేర్కొనబడినది.కావున దీనినే సూర్య సప్తమి అని అంటారు. *ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్* అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు అంటే సూర్యుడు ప్రసాదిస్తాడు కాబట్టి దీనినే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.🔵

⭕👉🏻 *సూర్య గ్రహణ పర్వదినంతో సమాన పుణ్యప్రదం రథ సప్తమి :-*

 _సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ_
 _అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్_
 _మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా_
 _కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః_

⭕👉🏻 *ఈ రోజు అరుణోదయ వేళ స్నానం చేయాలి :-*

అరుణోదయము అంటే సూర్యోదయానికి గంటన్నర పూర్వ సమయము. *అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలమ్* అని పురాణాల్లో పేర్కొనబడినది కావున *అరుణోదయ సమయంలో రేపు జిల్లేడు ఆకులో రేగుపండు  తలపై పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం పఠించాలి.*
*శ్లో :-యద్య జ్జన్మ కృతం పాపం* *మయా సప్తసు జన్మసు*
*తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమీ* అంటూ తల స్నానం చేస్తే మహాఫలం లభిస్తుంది. ఏమిటా మహా ఫలమంటే _ఆరోగ్యం_ .కావున ఈ ఒక్క రథ సప్తమి రోజే కాకుండా ప్రతిరోజూ ఇలా స్నానమాచరించడం ఆరోగ్యప్రదం.🔵

⭕👉🏻 *స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకోవాలి :-*

గర్గ మహాముని ప్రబోధము ప్రకారం రథ సప్తమి రోజు స్నానమాచరించేటప్పుడు తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకోవాలి.జిల్లేడుకు సంస్కృతములో అర్క అని పేరు.సూర్యుడి కూడా అర్కః అని పేరు.కావున సూర్యుడికి అర్క పత్రము అనగా జిల్లేడు పత్రము మిగుల ప్రీతి.🔵

⭕👉🏻  *సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి :-*

 _మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా._ ... రథ సప్తమి రోజు నదీ స్నానము విశేషం.స్నానమాచరించి సూర్యుని వైపు ముఖం చేసి అర్ఘ్యము వదిలితే కోట్ల రేట్ల పుణ్యం లభిస్తుంది.సూర్యగ్రహణం రోజు ఎలా స్నాన , జపదానాదులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందో తత్ సమానమైన పుణ్యం రథ సప్తమి రోజు చేసే స్నాన-దాన-జపాదుల వలన వస్తుంది.🔵

⭕👉🏻 *ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణం విశేషం :-*

రథ సప్తమి రోజు విధిగా స్నానమాచరించి ఆదిత్య హృదయంను పారాయణం చేయడం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది.🔵

⭕👉🏻 *ఈ వస్తువులు దానం చేయండి :-*

సూర్యుడికి ఎరుపు రంగు అత్యంత ప్రీతికరము.ఎరుపు రంగు వస్త్రము , గోధుమలు , బంగారము , ఎరుపు పూలు యథాశక్తి బ్రాహ్మణులకు దానం చేయాలి.అపాత్ర దానం చేయకూడదని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున సంస్కార హీనులైన బ్రాహ్మణులకు కాకుండా నిత్య దేవతార్చన , యజ్ఞ హోమాలు , జపతపాదులు చేసే యోగ్యమైన బ్రాహ్మణులకు దానం చేయడం వలన దాన ఫలం లభిస్తుంది.🔵

⭕👉🏻 *రథ సప్తమి వ్రతమును ఆచరించాలి :-*

భవిష్యోత్తర పురాణములో రథ సప్తమి వ్రత విధానము విశేషంగా వర్ణించబడినది.
రథ సప్తమి వ్రత కథను శ్రీకృష్ణుడు ... ధర్మరాజుకు తెలియజేశాడు.

 *ప్రణతోస్మి దివాకరమ్*

🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏 *శిశ్రీ*

రథ సప్తమి నాడు స్నానము చేసేటప్పుడు పఠించే శ్లోకం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
యద్యజ్ఙన్మ కృతం‌పాపం మయా *సప్తసు జన్మసు*
తస్య రోగంచ శోకంచ సమస్తం *హంతు సప్తమీ*
తా!! రథ సప్తమి నాడు స్నానము చేసేటప్పుడు జిల్లేడు ఆకు రేగిపండు తలమీద ఉంచుకొని
ఈ శ్లోకము పఠిస్తే ఏడు జన్మల‌నుండి వెన్నంటి వొస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి.
అని పురాణాలు చెబుతున్నాయి🙏🙏🙏🙏🙏
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు::
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి.. రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది.. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా.. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది... శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది.. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు... వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు.... అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట... దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట

ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు.. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి.. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ  త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది.. అలా ఈ సంవత్సరం వచ్చింది.. రేపు ఉదయం దాకా సప్తమి ఘడియలు ఉన్నాయి.. కాబట్టి ఈ రోజు అవకాశం దొరకని వారు కనీసం రేపైనా సూర్యునికి అంజలి ఘటించి నమస్కరించండి!!
మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు!!




0 వ్యాఖ్యలు:

Post a Comment