Tips of good health in telugu

The tips of good health..*

ఒబేసిటీ మరియు డయాబెటిస్ ను మందులు మరియు vayamam lekunda ఏ విధముగా ఆహారపు అలవాట్లు మార్చుకొనుట ద్వారా నియంత్రించవచ్చో తెలియచేసినారు. ఆ విషయాలను క్రింద వివరించారు. నచ్చిన వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఈ విషయాలు వారికిఉన్న సమస్యను బట్టి 15 నుండి 30 రోజులు
ఆచరించాలి. తరువాత పొట్ట మరియు వెయిట్ తగ్గిన తరువాత కొద్దీ పాటి జాగ్రత్తలతో అన్ని తినవచ్చు.

*1st రూల్.*
రోజుకు 70 గ్రామ్ - 100 గ్రామ్ ల ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ కొరకు వాడాల్చిన నూనెలు.
(a)వంట కొబ్బరి నూనె
(b)నాటు ఆవు నెయ్యి
(c)అలివ్ ఆయిల్
(d)పాల మీద మీగడ లేదా వెన్న లేదా బట్టర్ .
ఫ్యాట్ కి సంబందించి పైన నూనెలు మాత్రమే పైన చెప్పిన క్వాంటిటీ లో తీసుకోవాలి.

*2 వ రూల్*
రోజు కు 3 నిమ్మకాయలు వాడాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు లేకుండా ఈ నిమ్మరసం రోజులో ఎదో ఒక టైంలో త్రాగవచ్చు.

*3 వ రూల్*
రోజుకు నాలుగు లీటర్ల మంచినీరు త్రాగాలి.

*4 వ రూల్*
రోజు రాత్రి ఒక Multi విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలి.
పై నాలుగు రూల్స్ అనుసరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు.
1. పైన పేర్కొన్న నాలుగు రకాల ఆయిల్స్ తప్ప ఎటువంటి రిఫైనెడ్ ఆయిల్స్ వాడరాదు.
2. సముద్రపు కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి.
3. చింతపండు వాడరాదు.
4. Tasting సాల్ట్ వాడరాదు.
5. ఈ ఎనిమిది రకాల కూరగాయలు పూర్తిగా నిషిద్ధం. బంగాళదుంప, చిలకడ దుంప,చెమ దుంప,పెండలం, కంద, బీట్రూట్, అరటి మరియు బీన్స్.
6.ఉల్లి,క్యారెట్ మరియు టమోటో లు రోజుకి ఒకటీ వాడవచ్చు.
7. మిగిలిన కూరగాయలు unlimited గా తీసుకోవచ్చు.
8.vegtables అన్ని ఉప్పు నీళ్ల లో కడిగి వండాలి.
9.డీప్ ఫ్రై ల కు ఆలివ్ ఆయిల్ వాడరాదు.
10. పై నాలుగు రూల్స్ పాటించేటప్పుడు..
*(రైస్,ధాన్యాలు, స్వీట్స్, ఫ్రూట్స్ మరియు కూల్డ్రింక్స్ అసలు తినరాదు)*
11.Eggs విత్ yellow తినవచ్చు.
12. Non veg రోజుకు 250 గ్రామ్స్ - 300 గ్రామ్స్ వరకు తినవచ్చు.
13. మటన్ బోన్స్ సూప్ త్రాగవచ్చు.
14.chicken తాండూరి,tikka, కబాబ్, గ్రిల చికెన్ లను కలర్ మరియు కార్న్ లేకుండా తినవచ్చు.
15.పన్నీర్ రోజుకు 100 గ్రామ్స్ వరకు తినవచ్చు.
16.పెరుగు వాడరాదు.
17. పల్చటి మజ్జిగ వాడవచ్చు.
18.కొబ్బరి నీళ్లు త్రాగరాదు.
19.పాలు త్రాగరాదు.
20.గ్రీన్ టీ త్రాగవచ్చు.
20.షుగర్ , హనీ వాడరాదు.
21. కూరల్లో కొద్దిగా పాలు పోసుకొని వండుకోవచ్చు.
22.ఈ పద్ధతి లో మూడు రకాలైన నట్స్ వాడాలి. బాదంపప్పు, పిస్తా పప్పు, వాలనట్స్ రోజుకు 10 చొప్పున తినాలి.
23.ఈ పద్దతి లో కొన్ని రకాలైన గింజలు కూడా తీసుకోవాలి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు water melon సీడ్స్ రోజుకు 4- 5 స్పూన్స్ తినవచ్చు.
24.తెల్ల నువ్వులు మరియు ఆవిసే గింజలు powder గా mix చేసి రోజు 2 స్పూన్స్ తినాలి.
25.ముల్లంగి, సొర, బీర, కీరా వంటి ఫైబర్ వుండే వాటిని కూడా తీసుకోవాలి.
25.ఆకలి వేసినప్పుడూ మాత్రమే ఏదయినా తినాలి.
26. ఆకలి తీరెవరకు తినాలి.

*ఇది కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా avoid చేసి ఫాట్ అండ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకొని డయాబెటిస్, బి.పి, కోలేష్ట్రల్ వంటి వాటిని నియంత్రించే పద్దతి అని చెపుతున్నారు. చాలా మంది ఈ పద్దతి పాటించి బెనిఫిట్ పొందామని చెపుతున్నారు.*
*నమ్మకం కలిగితే ఆచరించి చూడండి.*


మా అమ్మ ( చీర ) కొంగు

*మా అమ్మ (చీర) కొంగు*
.          
*ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.* *ఎందుకంటే నేటి మమ్మీలు  చీరకట్టు తక్కువే.*
*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*
అంతేకాకుండా ..

*పొయ్యి మీద వేడి గిన్నెలను*
*దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*

*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు  కాగా  వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం  దాచుకునేది *అమ్మ కొంగు వెనకే.*
*అలాగే పిల్లలు ఈ మహా  చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు  అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని  వెచ్చగా చుట్టేది !*

*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*

*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*

*అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.*

*అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*

*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!*

*ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !
             
*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.*
*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు......*
*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*
*పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...*
*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....*
*ఇలా ఎన్నో ఎన్నెన్నో....*

*అమ్మ. బిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ, రెండో స్థనాన్ని పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*
*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....*

అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......

ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,అదృష్టవంతులు....


ఒడిస్సా లోని కోణార్క్ సూర్యనారాయ న టెంపుల్ wonder at every 200 years

ఒడిస్సా లోని కోణార్క్ సూర్యనారాయ న టెంపుల్ లోపల నుండి సూర్య భగవానుడు 200సంవత్సరా లకు ఒక సారిఉదయిస్తాడు ఈచిత్రాలను మీ స్నేహి తులకుపంపండి ధన ధాన్యాభి వృద్ధి కలుగుతుం ధి




Excellent good story

Excellent story
 

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు  ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు .
ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు..  మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!

మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.. థాంక్స్..🙏🙏🙏
Iam not the writer ... Received from one of the friends... Message is good   Hence forwarding  as received....


మనం తినే విధానమే తప్పే ! డాక్టర్‌లూ అనుసరిస్తున్న కొత్తపద్ధతి ఇదే!

మనం తినే విధానమే తప్పే! డాక్టర్‌లూ అనుసరిస్తున్న కొత్తపద్ధతి ఇదే!
AsiaNet News Telugu|

👉పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ, దోశ, పూరి, బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం, చపాతి, ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు, బజ్జీలు, బర్గర్, పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా? కార్బోహాడ్రేట్స్(పిండిపదార్థాలు).
ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది.
ఇదే మన కొంప ముంచుతోందని, షుగర్, బీపీ, ఒబేసిటీ, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది.
దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు, నెయ్యి, వెన్న వంటి ఫ్యాట్స్(కొవ్వు పదార్థాలు)తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది.
ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని, వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు.
ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం (డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది.
దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా, షుగర్, బీపీ, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు,పీసీఓడీ వంటి దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడేవారికి వాటినుంచి విముక్తి కలుగుతోంది.
అవును… మీరు చదివింది కరెక్టే.
ఇది అక్షరాలా నిజం. 3 నెలలపాటు ఒక నిర్ణీత పద్ధతిలో ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, కొవ్వుపదార్థాలను పెంచటమే ఈ కొత్త ప్రోగ్రామ్ లో అనుసరించే మూలసూత్రం.
కొందరు వైద్యులు కూడా ఈ ప్రోగ్రామ్ ను ఆచరించి సత్ఫలితాలు పొందామని బహిరంగంగా చెబుతున్నారు.
మీడియా కన్ను సరిగా పడకపోవటంతో పెద్దగా బయటకురాని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపందుకుంటోంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, తెలంగాణకు కూడా ​విస్తరిస్తోన్న ఈ కొత్త ఆహారవిధానంపై ప్రత్యేక కథనం​.
సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్(మాంసకృత్తులు), ఫ్యాట్స్ ఉంటాయి. బియ్యం, గోధుమలు వంటి ఆహారధాన్యాలలో, మినుములు, కందులు వంటి పప్పుదినుసులు, వీటన్నింటితో చేసే వంటకాలలో, పళ్ళలో, పంచదారలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటి మాంసాహారాలలో, కూరగాయలు, ఆకుకూరల్లో, డ్రై ఫ్రూట్స్, పనీర్, పెరుగులో ప్రొటీన్ ఉంటుంది. వంటనూనెలు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలలో ఫ్యాట్స్ ఉంటాయి. భూమిపై మానవజీవితం ఆవిర్భవించిననాటినుంచి మొదటి 25 లక్షల సంవత్సరాలపాటు మనిషి కార్బోహైడ్రేట్స్ తినలేదు… హంటర్ గేదరర్ (వేటతోనే జీవనం) గా ఉన్నాడు…
మాంసకృత్తులు(యానిమల్ ఫ్యాట్) అధికంగా తిన్నాడు.
నిత్యం సంచరిస్తుండటం, శారీరక శ్రమఉండటంతో నాడు మనుషులకు ఒబేసిటీ వంటి జీవనశైలి వ్యాధులు లేవు.
అయితే  గత పదివేల సంవత్సరాలనుంచి ఆ పరిస్థితి మారిపోయింది.
నాగరికత పెరగటంతో మనిషి ఆహారధాన్యాలు పండించటం నేర్చుకున్నాడు.
అప్పటినుంచి మనిషి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ పెరిగాయి. మరోవైపు 1857లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది.
యంత్రాల రాకతో అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయి… రోజువారీ జీవితంలో శారీరక శ్రమ తగ్గింది.
ఇదిలా ఉంటే 70 ఏళ్ళనాడు ఆవిష్కారమైన ఏన్సల్ కీస్ (Ancel keys) థియరీ జీవనశైలి వ్యాధులకు ముఖ్య కారణంగా మారింది.
కొవ్వు పదార్థాల వలన కొలెస్ట్రాల్ పెరుగుతుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని, తద్వారా గుండెజబ్బులు వస్తాయన్నది ఆ థియరీలోని వాదన.
దీనితో నూనెను తక్కువగా వాడటం, నెయ్యిని తగ్గించటం ప్రారంభమైంది. ఆహారంలో రిఫైండ్ ఫుడ్స్(బాగా పాలిష్ చేసిన బియ్యం, గోధుమలు), రిఫైండ్ ఆయిల్స్, రిఫైండ్ షుగర్ వాడకం పెరిగింది.
అయితే, 2007 నుంచి 2010 వరకు జరిగిన అనేక పరిశోధనల్లో కార్బోహైడ్రేట్స్ చేస్తున్న చెరుపు తెలియవచ్చింది.
ఇవి ఆహారంలో పెరిగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి దాని ప్రభావంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది… ముఖ్యంగా పొట్ట, పిరుదులు ప్రాంతంలో.
ఇదే అనారోగ్యానికి కారణమవుతోంది.  ఈ తాజా పరిశోధనల సారాన్ని క్రోడీకరించి గ్యారీ టాబ్స్ అనే సైంటిఫిక్ జర్నలిస్ట్ 2010 సంవత్సరంలో 'వై వుయ్ గెట్ ఫ్యాట్’, 'బ్యాడ్ క్యాలరీస్ అండ్ గుడ్ క్యాలరీస్' అనే రెండు పుస్తకాలు రాశారు.
ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సైంటిస్టులతోసహా అనేకమందిని ప్రభావితం చేస్తున్నాయి.
ఇక కొత్త ఆహారవిధానం విషయానికొస్తే - కార్బోహైడ్రేట్స్ తో నడుస్తున్న మన శరీర మెటబాలిజంను ఫ్యాట్స్ తో నడిచే మెటబాలిజంగా మార్చటమే దీనిలోని కీలకం.
ఒక్కమాటలో చెప్పాలంటే పెట్రోలుతో నడిచే కారు ఇంజనును గ్యాస్ కు మార్చటం లాంటిది. శాస్త్రీయంగా చెప్పాలంటే దీనిని 'ఎల్ సీ హెచ్ ఎఫ్’ (Low Carbohydrates High Fats) అని పిలుస్తున్నారు.
👉మూడునెలలు ఈ ఆహారవిధానాన్ని అనుసరిస్తే బరువు తగ్గటంతోబాటు బీఎమ్ఐ (Body Mass Index) కూడా గణనీయంగా తగ్గుతోంది.
ఈ విధానంద్వారా సాధారణ వ్యక్తులకు ఆరోగ్యం మెరుగవుతుండగా, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధులు నయమవుతున్నాయి.
మనం ఇప్పటివరకూ ఆహారంలో తీసుకుంటున్న కార్బోహైడ్రేట్ పరిమాణాన్ని 70-80 శాతం నుంచి 5-10 శాతానికి తగ్గించి, 20 శాతం మాత్రమే తీసుకుంటున్న ఫ్యాట్స్ ను 65-70 శాతానికి పెంచుతారు (ఇలా పెంచే ఫ్యాట్స్ లో ఫుల్లీ శాట్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే కొబ్బరినూనె, నెయ్యివంటి వాటిని మాత్రమే వాడాల్సిఉంటుంది).
స్వీడన్ దేశం అధికారికంగా ఈ 'ఎల్ సీ హెచ్ ఎఫ్' ఆహారవిధానాన్ని అనుసరిస్తోంది.
వాస్తవానికి ఈ విధానానికి మూలపురుషులు ఎరిక్ వెస్ట్ మేన్(Eric Westman), జెఫ్ వోలెక్ (Jeff Volek), స్టీఫెన్ ఫినే(Stephen Phinney), జేసన్ ఫంగ్ (Jason Fung) అనే విదేశీ వైద్యులని చెప్పాలి.

☝ఇప్పుడు ఏపీలో కూడా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో అనేకమంది ఈ విధానాన్ని ఆచరించి ఫలితాలు పొందుతున్నారు. ఏపీలో ఈ విధానానికి ఆద్యుడుగా డాక్టర్ పి.వి.సత్యనారాయణరావును చెప్పుకోవాలి.
విశాఖపట్నానికి చెందిన ఈ వైద్యుడు వాస్తవానికి కార్డియో థొరాసిక్ సర్జన్. 16,000 గుండె ఆపరేషన్లు చేసిఉన్నారు.
అయితే తనకు వచ్చిన షుగర్ వ్యాధిని, అధికబరువును తగ్గించుకునేందుకుగానూ తనమీదే ప్రయోగాలు చేసుకుని అది విజయవంతం కావటంతో, ఆ అనుభవంతో ఈ డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్ ను రూపొందించారు.
రెండేళ్ళనుంచి ఈ ప్రోగ్రామ్ తో రోగులకు సేవలు అందిస్తున్నారు.
తన ప్రోగ్రామ్ ద్వారా మూడే మూడు నెలల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించినా, అసలు తీసుకోకపోయినా జరిగే నష్టమేమీ ఉండదని ఈయన ఏషియానెట్ తో మాట్లాడుతూ వివరించారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేకమంది రోగులలో షుగర్ ను నార్మల్ కు తీసుకొచ్చామని తెలిపారు. పి.వి.సత్యనారాయణరావు టీవీ9 ఛానల్ లో రెండుసార్లు తన ప్రోగ్రామ్ ను వివరించటం తప్పితే పెద్దగా బయట విస్తృతంగా ప్రచారం చేసుకోవటంలేదు.
తాను పనిచేస్తున్న విశాఖపట్నం కేర్ ఆసుపత్రినుంచే ఈ సేవలను అందిస్తున్నారు.
ఇక ఈ కొత్త ఆహారవిధానాన్ని ప్రచారం చేస్తున్న రెండో వ్యక్తి విజయవాడవాసి, ప్రింటింగ్ వ్యాపారి అయిన రామకృష్ణారావు.
ఈయన వైద్యరంగానికి సంబంధించినవారు కాదు. 126 కిలోలున్న తన అధిక బరువును తగ్గించుకోవటానికి ప్రయోగాలు చేసుకుంటూ సత్ఫలితాలు పొంది విజయవంతం కావటంతో ఈ విధానాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు.
పోయిన సంవత్సరంనుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ నాగార్జున హాస్పిటల్(విజయవాడ) వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులలోనే శిబిరాలు పెట్టి ఈ ప్రోగ్రామ్ పై అవగాహన కల్పిస్తున్నారు.
ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రధాన వైద్యులు కూడా ఈయన ప్రోగ్రామ్ ను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు.
ఈ శిబిరాలకు వందల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు.
అయితే ఎవరివద్దా రామకృష్ణారావు ఒక్కపైసా కూడా తీసుకోకపోవటం ఒక విశేషం.
డయాబెటిస్ విషయంలో ప్రపంచంలో ఎవరూ సాధించలేనిదానిని తమ ప్రోగ్రామ్ సాధిస్తోందని, దీనిద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవటం మంచినీళ్ళప్రాయమని ఢంకా బజాయించి రామకృష్ణారావు చెబుతున్నారు.
తాను ఈ పద్ధతి ద్వారా తెలుగు రాష్ట్రాలనూ, తర్వాత యావత్ భారతదేశాన్ని మార్చేయబోతున్నానని అంటున్నారు.
ప్రజలను ఆరోగ్యవంతులను చేయటంద్వారా లక్షలకోట్ల రూపాయలు ఆదా అవుతాయని చెబుతున్నారు.
ఈ ప్రోగ్రామ్ వ్యవధి మూడు నెలలు ఉంటుంది.
దీనిని ప్రారంభించేముందు ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టేముందు ప్రధాన శరీర భాగాలన్నింటికీ ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.
కిడ్నీ, గుండె వంటి భాగాలకు జబ్బులేమీ లేకపోతేనే దీనిని ప్రారంభించాల్సిఉందని స్పష్టంగా చెబుతున్నారు.
ఇక పోతే ఈ ప్రోగ్రామ్ ను అనుసరించటానికి ఈ మూడు నెలలపాటూ ఇన్ పేషెంట్ గా ఆసుపత్రిలో చేరాల్సిన పని ఏమీ ఉండదు. మందులు కొనాల్సిన పనేమీలేదు. వారు చెప్పిన ఆహార పద్ధతిని ఎవరికి వారు తమ తమ ఇళ్ళలో తు.చ. తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి.
ఇదే అత్యంత ప్రధానమైన అంశం. ప్రోగ్రామ్ ను ఆచరించటం మొదలుపెట్టిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. నిరంతరం వైద్యులను సంప్రదిస్తూఉండాలి.
ఈ ప్రోగ్రామ్ వివరాలు ఇలా ఉన్నాయి...
👉కొత్త ఆహార విధానంలోని ముఖ్యాంశాలు
1. ఈ మూడు నెలలూ అన్నం, చపాతీలు, బ్రెడ్, ఇడ్లీ, దోశ, పూరి వంటి కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను పూర్తిగా దూరంపెట్టాల్సి ఉంటుంది.
2. కొబ్బరినూనె (తలకు రాసుకునేదికాదు-ఎడిబుల్), పామాయిల్ (రిఫైండ్ కానిది), వెన్న, నెయ్యి, మీగడ వంటి కొవ్వుపదార్థాలను రోజుకు 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవాలి.
వాల్ నట్స్, బాదం పప్పులవంటి నట్స్ ను తినాలి.3. మాంసాహారులు చికెన్, మటన్, చేప, గుడ్లువంటివన్నీ తినొచ్చు…
శాకాహారులు కూరగాయలు (కార్బోహైడ్రేట్స్ లేనివి), ఆకుకూరలను తీసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు యధావిధిగా వాడుకోవచ్చు.
వండటానికి పైన చెప్పిన ఫ్యాట్స్(కొబ్బరినూనె మొదలైనవి)నే వాడాలి.
4. ఏ విధమైన పళ్ళూ తీసుకోగూడదు. పంచదారను ముట్టరాదు.
5. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ నిషిద్ధం. అయితే కాఫీ, టీలను పాలు, పంచదార లేకుండా తీసుకోవచ్చు... మీగడ, క్రీమ్ తో.
పీవీ సత్యనారాయణ, రామకృష్ణారావుల ప్రోగ్రామ్ లలో తేడాలున్నప్పటికీ, మౌలికంగా పై 5 అంశాలు రెండింటిలో కామన్ గా ఉంటాయి...
ఇవి కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి.
అయితే ప్రోగ్రామ్ కాలవ్యవధి మూడు నెలలు ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ప్రోగ్రామ్ ముగిసిన కొంతకాలం తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందా అని సందేహం తలెత్తుతుంది.
దీనిపై స్పందిస్తూ, ప్రోగ్రామ్ తర్వాత ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (అన్నం, చపాతి, ఇడ్లీ, దోశ వంటివి)ను పునఃప్రారంభించటంపై వైద్యుల సలహాలు తీసుకుని వారి సూచనల మేరకు నడవాలని సత్యనారాయణ చెబుతున్నారు.
మరోవైపు మూడు నెలల తర్వాత యథేచ్ఛగా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను తినేయొచ్చని, ఏమీ కాదని, పూర్వపు పరిస్థితి వచ్చే సమస్యే లేదని రామకృష్ణ అంటున్నారు.
ఈ ప్రోగ్రామ్ ను ప్రచారం చేస్తున్న వీరిద్దరిదీ పూర్తి భిన్నమైన శైలి అని చెప్పాలి.
పీవీ సత్యనారాయణ వైద్యుడు కావటంతో ఈ ప్రోగ్రామ్ లోని ప్రతి చిన్న అంశాన్నికూడా శాస్త్రీయంగా, వైద్య శాస్త్రపరంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరించి చెబుతారు.
ఇటు రామకృష్ణారావుది మరో రకం.
ఈ విధానంలోని అంశాలను, దీని వలన కలిగే ప్రయోజనాలను కొట్టొచ్చినట్లుగా, బలంగా నాటుకుపోయేటట్లు వివరిస్తారు. వినేవారికి బలమైన గురి ఏర్పడేటట్లు చెప్పటం ఈయన శైలి.
వీరిద్దరూ ఈ ప్రోగ్రామ్ ను వాణిజ్యపరంగా కాకుండా, ఎక్కువమంది ప్రజలు ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యంతోనే ప్రచారం చేయటం విశేషం.
అయితే ఈ ప్రోగ్రామ్ కు ఇంతవరకు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం రాకపోవటంతో ప్రజలకు పెద్దగా తెలియటంలేదు.
త్వరలోనే ఇది పెద్దస్థాయిలో పాపులర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏది ఏమైనా వీరిరువురూ సూచించిన ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది సత్ఫలితాలను పొందారనిమాత్రం ఖరాఖండిగా తెలుస్తోంది. కొబ్బరినూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ వంటి ఖరీదైన పదార్థాలను తీసుకోవాలి కాబట్టి ఖర్చు ఎక్కువని అనిపిస్తుందిగానీ, ముందునుంచీ వాడే మందుల ఖర్చు లేకపోవటం, గతంలో తినే ఆహారపదార్థాలు క్వాంటిటీపరంగా తగ్గటంవలన ఆదా అయ్యే డబ్బులు, మెరుగయ్యే ఆరోగ్యంతో పోల్చుకుంటే ఓవరాల్ గా ఈ విధానానికి ఖర్చు తక్కువనే చెప్పాలి.
పైగా ఈ దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధులు తగ్గి ఆరోగ్యం మెరుగవటంవలన దేశానికి లక్షలకోట్ల జాతీయ ఆదాయం మిగిలిపోతుంది… ప్రొడక్టివిటీ పెరుగుతుంది.
దీనిని ఆచరించాలనుకునేవారు, ప్రోగ్రామ్ పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవాలనుకునేవారు వీరిరువురిలో ఎవరినైనా నేరుగా సంప్రదించి, ఆ తర్వాత తమ వ్యక్తిగత వైద్యుడు(ఫ్యామిలీ డాక్టర్)తో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఒక వీడియో ఇంటర్వ్యూ  క్రింది లింక్లో చూడొచ్చు. వీరిని కింద ఇచ్చిన నంబర్లలో సంప్రదించవచ్చు.
వి.రామకృష్ణారావు ఇంటర్వ్యూ - https://www.youtube.com/watch?v=LF0QiC5ALHw t=1777sడాక్టర్ పీవీ సత్యనారాయణ - 9949943437వి.రామకృష్ణారావు           - 9246472677కొత్త ఆహారవిధానానికి సంబంధించినమరికొన్ని అంశాలు
1. కొబ్బరినూనె(తలకు రాసుకునేది కాదు, ఎడిబుల్) అద్భుతమైన ఆహారపదార్థం. తల్లిపాలలో 60 నుంచి 65 శాతం శాట్చురేటెడ్ ఫ్యాట్స్(గుడ్ కొలెస్టరాల్ ను పెంచుతాయి) ఉంటాయి. ఇవి దాదాపు అదే స్థాయిలో కొబ్బరినూనెలో ఉంటాయి.
2. కొబ్బరినూనె తర్వాత పామాయిల్(రిఫైండ్ కానిది) కూడా వంటకు మంచిది.
3. సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి రిఫైండ్ వంటనూనెలలో పాలీ అన్ శాట్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది. ఈ రిఫైండ్ ఆయిల్ వలన ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. రిఫైండ్ ఆయిల్ ను రెండోసారి మరగబెడితే అత్యంత ప్రమాదకరం.
4. కోడిగుడ్డులో పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని అది తీసి తినేవాళ్ళం. కానీ అది మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుందని, దానిని కూడా తినాలని సూచిస్తున్నారు.
5. ఉపవాసం వలన శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. అయితే అన్నం మానేసి టిఫిన్లుగానీ, పళ్ళుగానీ తినటం వలన ఉపయోగం లేదు. కేవలం మంచినీరు, నిమ్మరసం తాగి ఒకటి, రెండు రోజులు ఉపవాసం ఉంటే ఎంతే మంచిది.
6. ఒకప్పుడు అమెరికాలో మాత్రమే దొరికే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ను పెద్ద ఎత్తున తయారయ్యే ఫ్రూట్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ లలో వాడుతుంటారు. ఇప్పుడు ఆ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఇండియాలో కూడా విరివిగా దొరుకుతోంది.
స్వీట్ నెస్ కోసం బేకరీ ఉత్పత్తులలో, స్వీట్స్ తయారీలో కూడా ఇక్కడ వాడుతున్నారు.
ఇది, దీనితోబాటు వాడే మైదాపిండికూడా విషంతో సమానమని చెబుతున్నారు.
7. మనిషి కనీసం రోజుకు పదివేల అడుగులు నడవాలి. ఇది నాలుగు కిలోమీటర్లకు సమానం.
8. రోజువారీ జీవితంలో మనిషికి వయస్సు, సైజును బట్టి 2,000 నుంచి 2,500 వరకు క్యాలరీలు ఉండే ఆహారం అవసరం ఉంటుంది. నాలుగువేల క్యాలరీలదాకా తీసుకుంటే స్థూలకాయం వస్తుంది.
9. అధికంగా తీసుకునే కార్బోహైడ్రేట్స్ వలన ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ యూరిక్ యాసిడ్ ను పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ను తగ్గిస్తుంది. దీనివలనే డిమెన్షియా, గుండెజబ్బులు, క్యాన్సర్ వస్తాయి.
10. మనిషికి రోజుకు 1 టీస్పూన్ పంచదార సరిపోతుంది. కానీ మనం సగటున 50 టీ స్పూన్ల పంచదారను వివిధ రూపాలలో ఆహారంలో, పానీయాలలో తీసుకుంటున్నాము… తద్వారా చెరుపును చేసే కార్బోహైడ్రేట్ల శాతాన్ని పెంచుకుంటున్నాము. (*రచయిత సీనియర్ జర్నలిస్టు ఫోన్ నెం.9848293346).

🛐🛐🛐


రథ సప్తమి విశేషాలు

🌞 *రథ సప్తమి విశేషాలు* 🌞
       
🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏

⭕👉🏻 *రథ సప్తమి :-* 24/1/2018 న
మాఘ మాసము , శుక్ల పక్షము , సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు.రథ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలలో పేర్కొనబడినది.కావున దీనినే సూర్య సప్తమి అని అంటారు. *ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్* అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు అంటే సూర్యుడు ప్రసాదిస్తాడు కాబట్టి దీనినే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.🔵

⭕👉🏻 *సూర్య గ్రహణ పర్వదినంతో సమాన పుణ్యప్రదం రథ సప్తమి :-*

 _సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ_
 _అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్_
 _మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా_
 _కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః_

⭕👉🏻 *ఈ రోజు అరుణోదయ వేళ స్నానం చేయాలి :-*

అరుణోదయము అంటే సూర్యోదయానికి గంటన్నర పూర్వ సమయము. *అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలమ్* అని పురాణాల్లో పేర్కొనబడినది కావున *అరుణోదయ సమయంలో రేపు జిల్లేడు ఆకులో రేగుపండు  తలపై పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం పఠించాలి.*
*శ్లో :-యద్య జ్జన్మ కృతం పాపం* *మయా సప్తసు జన్మసు*
*తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమీ* అంటూ తల స్నానం చేస్తే మహాఫలం లభిస్తుంది. ఏమిటా మహా ఫలమంటే _ఆరోగ్యం_ .కావున ఈ ఒక్క రథ సప్తమి రోజే కాకుండా ప్రతిరోజూ ఇలా స్నానమాచరించడం ఆరోగ్యప్రదం.🔵

⭕👉🏻 *స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకోవాలి :-*

గర్గ మహాముని ప్రబోధము ప్రకారం రథ సప్తమి రోజు స్నానమాచరించేటప్పుడు తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకోవాలి.జిల్లేడుకు సంస్కృతములో అర్క అని పేరు.సూర్యుడి కూడా అర్కః అని పేరు.కావున సూర్యుడికి అర్క పత్రము అనగా జిల్లేడు పత్రము మిగుల ప్రీతి.🔵

⭕👉🏻  *సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి :-*

 _మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా._ ... రథ సప్తమి రోజు నదీ స్నానము విశేషం.స్నానమాచరించి సూర్యుని వైపు ముఖం చేసి అర్ఘ్యము వదిలితే కోట్ల రేట్ల పుణ్యం లభిస్తుంది.సూర్యగ్రహణం రోజు ఎలా స్నాన , జపదానాదులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందో తత్ సమానమైన పుణ్యం రథ సప్తమి రోజు చేసే స్నాన-దాన-జపాదుల వలన వస్తుంది.🔵

⭕👉🏻 *ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణం విశేషం :-*

రథ సప్తమి రోజు విధిగా స్నానమాచరించి ఆదిత్య హృదయంను పారాయణం చేయడం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది.🔵

⭕👉🏻 *ఈ వస్తువులు దానం చేయండి :-*

సూర్యుడికి ఎరుపు రంగు అత్యంత ప్రీతికరము.ఎరుపు రంగు వస్త్రము , గోధుమలు , బంగారము , ఎరుపు పూలు యథాశక్తి బ్రాహ్మణులకు దానం చేయాలి.అపాత్ర దానం చేయకూడదని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున సంస్కార హీనులైన బ్రాహ్మణులకు కాకుండా నిత్య దేవతార్చన , యజ్ఞ హోమాలు , జపతపాదులు చేసే యోగ్యమైన బ్రాహ్మణులకు దానం చేయడం వలన దాన ఫలం లభిస్తుంది.🔵

⭕👉🏻 *రథ సప్తమి వ్రతమును ఆచరించాలి :-*

భవిష్యోత్తర పురాణములో రథ సప్తమి వ్రత విధానము విశేషంగా వర్ణించబడినది.
రథ సప్తమి వ్రత కథను శ్రీకృష్ణుడు ... ధర్మరాజుకు తెలియజేశాడు.

 *ప్రణతోస్మి దివాకరమ్*

🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏 *శిశ్రీ*

రథ సప్తమి నాడు స్నానము చేసేటప్పుడు పఠించే శ్లోకం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
యద్యజ్ఙన్మ కృతం‌పాపం మయా *సప్తసు జన్మసు*
తస్య రోగంచ శోకంచ సమస్తం *హంతు సప్తమీ*
తా!! రథ సప్తమి నాడు స్నానము చేసేటప్పుడు జిల్లేడు ఆకు రేగిపండు తలమీద ఉంచుకొని
ఈ శ్లోకము పఠిస్తే ఏడు జన్మల‌నుండి వెన్నంటి వొస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి.
అని పురాణాలు చెబుతున్నాయి🙏🙏🙏🙏🙏
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు::
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి.. రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది.. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా.. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది... శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది.. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు... వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు.... అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట... దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట

ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు.. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి.. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ  త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది.. అలా ఈ సంవత్సరం వచ్చింది.. రేపు ఉదయం దాకా సప్తమి ఘడియలు ఉన్నాయి.. కాబట్టి ఈ రోజు అవకాశం దొరకని వారు కనీసం రేపైనా సూర్యునికి అంజలి ఘటించి నమస్కరించండి!!
మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు!!


Best books for IAS exams preparation


Best IAS Websites for UPSC Civil Services Exam Online Preparation

1. *insightsonindia.com*
2. *clearias.com*
3. *Mrunal.org*
4. *gktoday.in*
5. *currentaffairsonly.com*
6. *cleariasexam.com*
7. *IASexamportal.com*
8. *visionias.wordpress.com*
9. *swapsushias.blogspot.in*
10. *iaspassion.com*
11. *iasscore.in*
12. *iaskracker.com*
13. *jagranjosh.com*
14. *UPSCguide.com*
15. *CivilServiceIndia.com*
16. *ias100.in*
17. *jeywin.com*
18. *civilsdaily.com*
19. *onlinegk.com*
20. *iasaspirants.com*
21. *iaspaper.in*
22. *iasexams.com*
23. *tcyonline.com*
24. *testfunda.com*
25. *byjusclasses.com*

IAS Forum Websites
1. *iasforums.com*
2. *upscforums.com*
3. *forumias.com*
4. *indianofficer.com*
5. *interviewprep4ias.com*
6. *upscdiscussions.com*

IAS Toppers Blogs
1. *thesupermanreturns.wordpress.com*
2. *rijubafna.com*
3. *youtube.com/user/unacademy*
4. *lohitmatani.wordpress.com*
5. *iasdream.com*
6. *jhinujha.wordpress.com*

Useful Government Websites For Civil Service Preparation *
1. *ncert.nic.in* – Download NCERT Texts as PDF.
2. *nios.ac.in* – Download NIOS Online Materials.
3. *egyankosh.ac.in* – Download IGNOU Books.
4. *yojana.gov.in* – Download Yojana and Kurukshetra Magazines.
5. *upsc.gov.in* – Official Website of UPSC.
6. *pib.nic.in* – Press Information Bureau Website, for government updates.
7. *prsindia.org* – PRS Website for tracking bills in Parliament.
8. *idsa.in* – IDSA website for Defense and Foreign relations.
9. *gatewayhouse.in* – Indian Council for Global relations.
10. *envfor.nic.in* – Ministry of Environment and Forests.
11. *mea.gov.in* – Ministry of External Affairs.
12. *indiabudget.nic.in* – Download Budget and Economic Survey.
13. *ptinews.com* – Press Trust of India.
14. *pdgroup.upkar.in* – Pratiyogita Darpan Magazine.
15. *ibef.org* – India Brand Equity Foundation for economy and business.
16. *vikaspedia.in* – Knowledge initiative by InDG.
17. *makeinindia.com* – Make in India initiative for manufacturing related info.