Total life with two letters : Telugu story

✌🏻రెండక్షరాల జీవితం✌🏻
-------------------------------
✌🏻"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి
✌🏻"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని
✌🏻రెండక్షరాల "అవ్వ "తాత "
"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "
అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ
✌🏻రెండక్షరాల "గురు " వు దగ్గర
✌🏻రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని
✌🏻రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి
✌🏻రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే
బంధాలను ఏర్పరచుకొని
✌🏻రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ
✌🏻రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ
✌🏻రెండక్షరాల "బాధ "ని భరిస్తూ
✌🏻రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని
✌🏻రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి
✌🏻రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి
✌🏻రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ
✌🏻రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ
✌🏻రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ
✌🏻రెండక్షరాల "ముప్పు " వచ్చి
✌🏻రెండక్షరాల "చావు " వచ్చే వరకు
✌🏻రెండక్షరాల "ముఖం "పైన
✌🏻రెండక్షరాల "నవ్వు "ఉంటే
✌🏻రెండక్షరాల "స్వర్గం "మన
అరచేతిలో ఉన్నట్లే..!!
ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....
👌👍👌👍👌👍👌
😊🤝😊🤝😊🤝😊
🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻
🌹🌹🌹🌹


God rama vamsha vrukham

*రాముడి వంశ వృక్షo*

*ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం*

*బ్రహ్మ కొడుకు మరీచి*

*మరీచి కొడుకు కాశ్యపుడు.*

*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*

*సూర్యుడు కొడుకు మనువు.*

*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*

*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*

*కుక్షి కొడుకు వికుక్షి.*

*వికుక్షి కొడుకు బాణుడు.*

*బాణుడు కొడుకు అనరణ్యుడు.*

*అనరణ్యుడు కొడుకు పృధువు.*

*పృధువు కొడుకు త్రిశంఖుడు.*

*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*

*దుంధుమారుడు కొడుకు మాంధాత.*

*మాంధాత కొడుకు సుసంధి.*

*సుసంధి కొడుకు ధృవసంధి.*

*ధృవసంధి కొడుకు భరతుడు.*

*భరతుడు కొడుకు అశితుడు.*

*అశితుడు కొడుకు సగరుడు.*

*సగరుడు కొడుకు అసమంజసుడు.*

*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*

*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*

*దిలీపుడు కొడుకు భగీరధుడు.*

*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*

*కకుత్సుడు కొడుకు రఘువు.*

*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*

*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*

*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*

*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*

*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*

*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*

*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*

*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*

*అంబరీశుడు కొడుకు నహుషుడు.*

*నహుషుడు కొడుకు యయాతి.*

*యయాతి కొడుకు నాభాగుడు.*

*నాభాగుడు కొడుకు అజుడు.*

*అజుడు కొడుకు ధశరథుడు.*

*ధశరథుడు కొడుకు రాముడు.*

*రాముడి కొడుకులు లవ కుశలు . .*

*ఇది రాముడి వంశ వృక్షo ...*
***************👏👏👏


Students scholarship international

  I know last year these wonderful messages helped some needy kids n families win some scholarships. 

Please share these opportunities within your networks👇

1. Australia Award  Scholarship (http://australiaawardsindo.or.id)
2. LPDP Scholarsh hip (http://www.beasiswalpdp.org/index.html)
3. DIKTI Scholarship a. Dalam Negeri (http://www.beasiswa.dikti.go.id/dn/)b. Luar Negeri (http://beasiswa.dikti.go.id/ln/)
4. Turkey Government Scholarship (http://www.turkiyeburslari.gov.tr/index.php/en)
5. General Cultural Scholarship India (http://www.iccrindia.net/gereralscheme.html)
6. USA Government Scholarship a. (http://www.aminef.or.id/index.php)b. (http://www.iief.or.id)
7. Netherland Government Scholarship (http://www.nesoindonesia.or.id/beasiswa)
8. Korean Government Scholarship (http://www.niied.go.kr/eng/contents.do…)
9. Belgium Government Scholarship (http://www.vliruos.be/4273.aspx)
10. Israel ... ... xxx
11. Sciences Po France (http://formation.sciences-po.fr/…/the-emile-boutmy-scholars…)
12. Utrecht University Netherland (http://www.uu.nl/…/grantsandscholarships/Pages/utrechtexcel…)
13. Prasetya Mulya Business School Indonesia (http://www.pmbs.ac.id/s2/scholarship.php?lang=ENG)
14. Brunei Darussalam Government Scholarship (http://www.mofat.gov.bn/index.php/announcement)
15. Monbugakusho Scholarship Japan (http://www.id.emb-japan.go.jp/sch.html)
16. Paramadin ba University Master Fellowship Indonesia (https://gradschool.paramadina.ac.id/…/paramadina-medco-fell…)
17. PPM School of Management Indonesia (http://ppm-manajemen.ac.id/beasiswa-penuh-s2-mm-reguler/)
18. University of Twente Netherland (http://www.utwente.nl/internationa…/scholarshipsandgrants/…/)
19. Sweden Government Scholarship (http://www.studyinsweden.se/Scholarships/)
20. Chinese Government Scholarship (http://www.csc.edu.cn/laihua/scholarshipdetailen.aspx…)
21. Taiwan Government Scholarship (http://www.studyintaiwan.org/taiwan_scholarships.html)
22. United Kingdom Government SCholarship (http://www.chevening.org/indonesia/)
23. Panasonic Scholarship Japan (http://panasonic.net/citizensh…/scholarships/…/requirements/)
24. Ancora Foundation Scholarship (http://ancorafoundation.com)
25. Asian Public Intellectuals Fellowship Japan (http://www.api-fellowships.org/body/)
26. AUN/SEED-Net Scholarship (http://www.seed-net.org/index.php)
27. Art Asia Major Scholarship Korea National University of Arts (http://eng.karts.ac.kr:81/karts/board/list.jsp…)
28. Ritsumeikan Asia Pacific University Japan (http://www.apu.ac.jp/home/life/index.php?content_id=30)
29. Seoul National University Korea (http://en.snu.ac.kr/…/gradu…/scholarships/before-application)
30. DIKTIS Overseas Scholarship (http://www.pendis.kemenag.go.id/beasiswaln/)
31. Honjo International Scholarship Foundation Japan (http://hisf.or.jp/english/sch-f/)
32. IDB Merit Scholarship Programme for High Technology (http://www.isdb.org/irj/portal/anonymous…)
33. International HIV & Drug Use Fellowship USA (http://www.iasociety.org/fellowship.aspx)
34. Nitori International Scholarship Foundation Japan (http://www.nitori-shougakuzaidan.com/en/)
35. School of Government and Public Policy Indonesia (http://sgpp.ac.id/pages/financial-conditions)
36. Inpex Scholarship Foundation Japan
37. Asia University Taiwan (http://ciae.asia.edu.tw/AdmissionsScholarship.html)
38. Macquaire University Australia (http://www.mq.edu.au/…/macquarie_university_international_…/ .

Please share for the benefit of our youth. 


Control to BP and Hourt attacks with vittala sound : a Telugu story

*" విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!*
పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి & ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది.
విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు *' ఠ్ఠ '* అనే  అక్షరం నుండి  వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది.
రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది.
పదిరోజులపాటు,
రోజుకు 9 ని... శాంత చిత్తంతో *విఠ్ఠల* నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.

కాబట్టి ఈ రోగాలున్నవారు పదిరోజులపాటు *విఠ్ఠల* నామస్మరణ  మొదలెట్టండి. పోతే  రోగం పోవచ్చు లేదా పుణ్యం వస్తుంది. ఏం జరిగినా మంచిదేకదా!


Life message very good in Telugu

1. జీవితంలో ఎప్పుడైనా

       ఎవరి నైనా పనికి రాని వారిగా

         పరిగణించవద్దు ఎందుకంటే

           చెడిపోయిన గడియారం

             కూడ రోజుకు రెండు సార్లు

               సరైన సమయం

                  సూచిస్తుంది.

🗣

2.  పేదరికం ధరిచేరినప్పుడు

      ఆప్తమిత్రులు కూడ

        దూరమైతారు అదే

          ధనవంతులైనప్పుడు

            తెలియని వారు కూడ

               మిత్రులవుతారు

🗣

3. ఒక్క సారి నవ్వుతూ చూడు

      ప్రపంచంలో ఉండే అందాలన్ని

        నీ సొంతమవ్వుతాయి కానీ

          తడిసిన కనురెప్పలతో

             చుస్తే అద్దంకూడ మసక

                బారి పోతుంది

🗣

4. తొందరగా దొరికేది ఏదైనా

       ఎక్కువకాలం మన్నికరాదు

         ఎక్కువకాలం మన్నిక

           వచ్చేది అంతతొందరగా

              దొరకదు

5. జీవితంలో వచ్చే చెడు రోజులు

      కూడా మన మంచి కొరకే

        అనుకోవాలి అప్పుడే

          తెలుస్తుంది నిజమైన

            స్నేహితులు ఎవరనేది

🗣

6. మనిషికి రోగాలు కుందేలు లాగా

      వస్తాయి తాబేలు లాగా

        వెళ్లుతాయి కానీ డబ్బులు

          తాబేలు లాగ వస్తాయి

             కుందేలు లాగా

                వెళ్లుతాయి

🗣

7. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని

       వెతకటం అలవాటు

         చేసుకోవాలి ఎందుకంటే

           పెద్ద పెద్ద మాటలు

             జీవితంలో చాలా

                అరుదుగా చోటు

                   చేసుకుంటాయి

🗣

8.దేవుడిని ప్రార్ధించినప్పుడు

      నాకు ఏమి ఇవ్వలేదని

        బాధపడకు ఎందుకంటే

          నీకు అక్కడ ఇవ్వక

            పోయినా నీకు నచ్చిన

              చోట నీకు దేవుడు

                నచ్చినవిధంగా ఇస్తాడు

🗣

9. నిత్యము ఎదురయ్యే

        అపజయాలను చూసి

          నిరాశ చెందకు కానీ

            ఒక్కోసారి తాళంచెవి

              గుచ్చంలో ఉండే ఆఖరి

                తాళంచెవి కూడ తాళం

                   తెరుస్తుందని

                      గమనించు

🗣

10. ఈ సమాజంలో నేను ఒక్కడిని

         ఎంచేయగలననీ ప్రతి మనిషి

           నిరాశ చెందుతుంటాడు

             కానీ ఒక్క సారి తలపైకెత్తి

               చూడు ప్రపంచానికి

                వెలుగునిచ్చే సూర్యుడు

                   కూడ ఒక్కడేనని 

🗣

11. బంధవులు ఎంత చెడ్డ వారైనా

         సరే వదులుకోవద్దు

           ఎందుకంటే మురికి నీరు

             దప్పిక తీర్చలేక పోయిన

               కనీసం అగ్గి మంటలు

                 ఆర్పటానికి పనికి

                    వస్తాయి

🗣

12. మనకు మాటలు రాక ముందు

       మనము ఏంచెప్పబోతున్నామో

         అమ్మకు అర్థమయ్యేది కాని

           మనము మాటలు అన్ని

             నేర్చిన తరువాత ఇప్పుడు

                మాటమాటకు ప్రతిసారి

                   అమ్మా నీకు అర్థం

                      కాదులే అంటాం

🗣

13. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు

          దూరమైనారని బాధపడకు

            ఎందుకంటే నీవు ఒక్కనివే

               జయించగలవని వారు

                 నమ్మినందుకు నీవు

                     సంతోషించు

🗣

14. జీవితంలో హెచ్చుతగ్గులు

         రావటంకూడ మనమంచి

           కోసమే అనుకోవాలి

             ఎందుకంటే ECG లొ

               వచ్చే సరళరేఖా కూడ

                  మృత్యువును

                     సూచిస్తుంది

🗣

15. ఈ రోజుల్లో సంబంధాలు

         రొట్టె తొ సమానమైనవి

           ఎందుకంటే కొద్దిగా మంట

             ఎక్కవైందొలెదో రొట్టె

         మాడిమసి కావటం ఖాయం

🗣

16. జీవితంలో మంచి వారి కోసం

         అన్వేషించ వద్దు ముందు

            నీవు మంచిగా మారు

              బహుశా నిన్ను కలిసిన

                వ్యక్తికి మంచి మనిషి

                   అన్వేషణ పూర్తి

                      కావచ్చు నేమో

🗣

ధర్మంగా జీవించు ధర్మబద్దంగా  ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది.


Great about talibottu mangalyam

తాళిబొట్టు-మాంగల్యం_....
........................................
దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూసోదరీమణులు నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం.

 సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఎక్కువ శాతం కనిపిస్తున్న లేదా మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు అన్ని ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాల అరిష్టం.

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

*“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం”*

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

పాశ్చాత్య అనుకరణ వెర్రి లో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.

కంచి పరమాచార్య పథం పుస్తకాల నుండి, కొంత స్వయంగా గ్రహించి రాసినవి. ఏమైనా తప్పులుంటే పెద్దలు సరిదిద్ది మన్నించగలరు.

*సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు!*


About you and me : a good message in telugu

ఎంత డబ్బున్న ఏమిటి చనిపోతే ప్రక్కనింటి వారు చూడటానికి రాకపోతే ?

         తమిళనాడు ముఖ్యమంత్రి *జయలలిత వదిలి వెళ్ళిన ఒక నిజం*

         కోటానుకోట్ల ఆస్తులు, బంగ్లాలు, బంగారం, ఆమె సొంతం.

         చిటికేస్తే రాష్ట్రాన్ని గడగడ లాడించే బలగాలు ఆమె కనుసన్నల్లో...,

         అవసరమైతే అంతరిక్షం నుండి కూడా వైద్యులను పిలిపించుకుని చికిత్స చేయించుకునే పరపతి పలుకుబడి ఆమె సొంతం.

         శరీరంలోని ప్రతి అవయవాన్ని మార్చుకోగల, ఆమె కోసం దానం చేయగల అభిమానులు ఆమె సొంతం...

         ఎన్ని ఉన్నా ,
ఎంత సంపాదించినా,
ఎంత బలగం ఉన్నా ...
వెళ్లాల్సిన సమయం వచ్చినపుడు
ఏ ఒక్క అంశం అడ్డుకోలేదు.
అన్ని వదిలి ఒక మోడులా,
తలవంచుకుని మౌనంగా,  ఒంటరిగా,  వెళ్లిపోవలసిందే....

          ఈ మాత్రం దానికే ఇంత కోపాలు, కక్షలు ,అంతస్తులపై అధికారంపై  ఆశలు,  వాటికోసం కుట్రలు,
ప్రతిరోజూ పాకులాటలు.
ఇది నాదీ ---అది కూడా నాదే --ఇంకెందుకు "
ఇక మారాలి .

          ఒక ప్రశాంతమైన జీవితం ఉంటే చాలదా..?

          *నేను* అనేది మరిచి..,
          *"మనం"* అనేది నేర్చుకోవాలి......
                   🙋🏼‍♂ ఓ.... మనిషి.  
🙏  🙏🏻  🙏🏻  🙏🏻   🙏🏻   🙏🏻


Present status about world

*ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ల ఆదాయం*... వేలల్లో...
1. సైనికుడు
2.రైతు
3. టీచర్

🐰 *ప్రపంచాన్ని ఉపయోగించుకునే వాళ్ల ఆదాయం*.... _లక్షల్లో...
1. ఇంజనీర్స్
2. డాక్టర్స్
3. బ్యూరోక్రాట్స్

🐰 *ప్రపంచాన్ని నాశనం చేసే వాళ్ల ఆదాయం*... కోట్లలో..
1. రాజకీయ నేతలు
2. కార్పోరేట్స్
3. సినిమా వాళ్లు
సమాజంలో మార్పులు🌸 ఓ ఆసక్తికరమైన విశ్లేషణ👇

1. గతంలో ఇంట్లో తిని బహిర్భూమి కోసం దూరంగా వెళ్లేవారు...
ఇప్పుడు బయట తిని, ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు.

2. గతంలో మనుషులకు కాపలా కోసం బయట కుక్కల్ని పెట్టుకునేవారు...
ఇప్పడు ఇంట్లో కుక్కల్ని పెట్టుకుని బయట కాపలాగా మనుషుల్ని పెట్టుకుంటున్నారు.

3. గతంలో ఇంట్లో వాళ్లు వండితే బయటివాళ్లు వచ్చి తిని పోయేవాళ్లు...
ఇప్పుడు బయటివాళ్లు వచ్చి వండి పెడితే ఇంట్లోవాళ్లు తింటున్నారు.

4. గతంలో పెళ్లిళ్లు జరిగినప్పుడు బయటినుండి వచ్చినవాళ్లు ఆడి పాడితే ఇంట్లోవాళ్లు, బంధువులు చూసి ఆనందించేవారు...
ఇప్పుడు పెళ్లిళ్లలో సంగీత్ పేరిట ఇంట్లో వాళ్లు ఆడిపాడితే బయటివాళ్లు చూసి ఆనందిస్తున్నారు.

5. ఇది వరకు పిల్లలు పుట్టిన తర్వాత ముహూర్తాలు, జాతకాలు చూసేవారు...
ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని సిజేరియన్ ద్వారా పిల్లలను కంటున్నారు.

6.  ఒక్కప్పడు నీతులు స్కూల్ లో చెప్పేవారు ....ఇప్పుడు whatsapp , facebook లో చెపుతున్నారు ....కానీ ...పాటించే వారు మాత్రం ఎవరు లేరు 😞😞


Cell radiation information finding

_మీరు ఉపయోగించే సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటేనే మీ ఫోన్‌తో పాటు మీరు కూడా సేఫ్ అని అర్థం...ఇంతకు మించి రేడియేషన్ మీ సెల్ ఫోన్‌లో చూపిస్తే...వీలైనంత త్వరగా ఫోన్ మార్చుకోవడమే మంచిదట. ఫోన్‌లో రేడియేషన్ స్థాయిని తెలుసుకోవాలంటే *#07# కు డయిల్ చేస్తే చాలు మీ సెల్ ఫోన్ రేడియేషన్ ఎంతో మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.So forward this msg 2 all ur frnds_...♨🚀📱🔥


Human life good message

Please 30 Sec చదివి ఆలోచించండి
🌷 నీ విలువ ఎంత --?🌷

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు "నా జీవితం విలువ ఏంత” అని.

అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా...

కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.

ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు.

కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరి నుండి వెళ్ళిపోయాడు.

తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు.

 ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ, ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిదండీ ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్నా , మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు

... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు....

ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు....

వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి.

కానీ, నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి...Human LIFE  is a great boon🙏🙏
Love your life and try to associate with the people,  who can appraise your value. 👍

వీలయినంత  ఎక్కువ మందికి చేరేలా చూడండి.